జగన్‌కు షాక్... రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా... ఆమోదించిన చైర్మన్
- ఆర్.కృష్ణయ్య రాజీనామాను ఆమోదించిన రాజ్యసభ చైర్మన్
- ఆ స్థానం ఖాళీ అయిందంటూ బులెటిన్ విడుదల
- 2022లో కృష్ణయ్యను రాజ్యసభకు పంపిన వైసీపీ
తెలంగాణ బీసీ నేత ఆర్.కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి నిన్న రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ నేడు ఆమోదించారు. 2022 జూన్‍లో ఆర్.కృష్ణయ్యను వైసీపీ రాజ్యసభకు పంపించింది. తెలంగాణకు చెందిన బీసీ నేతను రాజ్యసభకు పంపించడంపై అప్పుడు చర్చ జరిగింది. అయితే ఆయన అనూహ్యంగా నిన్న రాజీనామా చేశారు.
వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉండగా, మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు ఇదివరకే రాజీనామా చేశారు. తాజాగా ఆర్.కృష్ణయ్య రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. దీంతో వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 8కి పడిపోయింది. ఆర్.కృష్ణయ్య స్థానం ఖాళీ అయిందంటూ రాజ్యసభ చైర్మన్ బులెటిన్ విడుదల చేశారు.