అనంతపురం జిల్లాలో రథం తగులబెట్టిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

  • కనేకల్ మండలం హనకనహళ్ గ్రామంలో ఘటన
  • వేకువజామున రథాన్ని తగులబెట్టిన దుండగులు
  • నిందితులను వదిలిపెట్టేది లేదన్న సీఎం చంద్రబాబు
  • జిల్లా కలెక్టర్, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు
ఇవాళ వేకువజామున అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహళ్ వద్ద రామాలయంలో రథాన్ని దుండగులు దగ్ధం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రథం దగ్ధం ఘటనను ఖండించిన ఆయన, ఇది మన సంస్కృతి, విలువలపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. 

ఇలాంటి అపవిత్రమైన చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని, వారిని చట్టం ముందు నిలబెడతామని అన్నారు. రథం దగ్ధం ఘటనపై విచారణను స్వయంగా తానే పర్యవేక్షిస్తానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వీలైనంత త్వరగా నిందితులపై చర్యలు ఉండేలా చూస్తానని పేర్కొన్నారు.

వెంటనే ఘటన స్థలానికి వెళ్లాలని చంద్రబాబు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులను ఆదేశించారు. వెంటనే దర్యాప్తు ఆరంభించి, రథం తగులబెట్టిన వారిని పట్టుకోవాలని నిర్దేశించారు.


More Telugu News