సిక్సర్ల చరిత్ర సృష్టించిన నికోలస్ పూరన్.. 20 ఏళ్ల టీ20 క్రికెట్‌లో ఇదే తొలిసారి
- ఒక క్యాలెండర్ ఏడాదిలో 150కిపైగా సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా అవతరణ
- ఈ ఏడాది ఇప్పటివరకు 151 సిక్సర్లు బాదిన వెస్టిండీస్ పవర్ హిట్టర్
- పూరన్ తర్వాతి స్థానంలో నిలిచిన క్రిస్ గేల్
వెస్టిండీస్ స్టార్ బ్యాటర్, పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ సంచలన రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఏడాదిలో 150కి పైగా సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 63 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్ ఏకంగా 151 సిక్సర్లు కొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో (సీపీఎల్) మంచి ఫామ్‌లో ఉండడంతో అతడు మరిన్ని సిక్సర్లు బాదే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
సీపీఎల్ టోర్నీలో పూరన్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టుకు ఆడుతున్నాడు. టోర్నీలో భాగంగా తాజాగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 43 బంతుల్లో 93 పరుగులు బాది నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో కొట్టిన 7 సిక్సర్లతో కలుపుకొని ఈ క్యాలెండర్ ఏడాదిలో అతడి మొత్తం సిక్సర్ల సంఖ్య 150 దాటింది. అంతేకాదు ఈ ఏడాది అతడు 2000 టీ20 పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు.
కాగా ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో పూరన్ తర్వాత స్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ ఒక ఏడాది అత్యధికంగా 135 సిక్సర్లు బాదాడు.
ఒక ఏడాదిలో 100కిపైగా సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీళ్లే..
1. నికోలస్ పూరన్ -151 (2024)
2. క్రిస్ గేల్ - 135 (2015)
3. క్రిస్ గేల్ - 121 (2012)
4. క్రిస్ గేల్ - 116 (2011)
5. క్రిస్ గేల్ - 112 (2016)
6. క్రిస్ గేల్ - 101 (2017)
6. ఆండ్రూ రస్సెల్ - 101 (2019)
7. క్రిస్ గేల్ - 100 (2013)