దేవినేని అవినాశ్, తలశిల రఘురాం విచారణకు సహకరించడం లేదు: మంగళగిరి పోలీసులు
- టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు
- ఈరోజు దేవినేని, తలశిలను విచారించిన పోలీసులు
- తెలియదు, మర్చిపోయాం అంటూ సమాధానాలు చెప్పారన్న సీఐ
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, తలశిల రఘురామ్ లను మంగళగిరి పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ విచారణకు సహకరించడం లేదని సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళతామని చెప్పారు.
అవినాశ్, రఘురాంలను పోలీసులు ఈరోజు విచారణకు పిలిచారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తలశిల రఘురాంను విచారించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 గంటల వరకు అవినాశ్ ను విచారించారు. పోలీసులు రఘురాంను 7 ప్రశ్నలు, అవినాశ్ ను 11 ప్రశ్నలు అడిగారు. అయితే అన్ని ప్రశ్నలకు గుర్తులేదు, మర్చిపోయాం, తెలియదు అని వారు సమాధానాలు చెప్పారని సీఐ తెలిపారు.