ఓటీటీలో .. ఈ రోజు నుంచి తెలుగులో బాలీవుడ్ సూపర్ హిట్!
- జులైలో థియేటర్లకు వచ్చిన 'కిల్'
- మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమా
- ఆల్రెడీ హాట్ స్టార్ లో ఉన్న హిందీ కంటెంట్
- ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చిన తెలుగు వెర్షన్
బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలలో .. ఎక్కువమంది మాట్లాడుకున్న సినిమాలల్లో 'కిల్' ఒకటిగా కనిపిస్తుంది. లక్ష్ లల్వాని - తాన్య మనక్తిలా జంటగా నటించిన ఈ సినిమా, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందింది. జులై 5వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేశారు. హింస ఎక్కువగా ఉందనే టాక్ వచ్చినప్పటికీ, ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతూ వెళ్లింది.
లక్ష్ ఈ సినిమాలో ఎన్ ఎస్ జీ కమాండర్ అమిత్ రాథోడ్ అనే పాత్రను పోషించాడు. ఆయన ప్రియురాలిగా తాన్య అలరిస్తుంది. యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉన్న ఈ సినిమా, చాలా రోజులుగా హిందీలో .. హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాంటి ఈ సినిమా, ఈ రోజు నుంచి తెలుగు .. తమిళ భాషల్లోను అందుబాటులోకి వచ్చింది. విక్రమ్ - శాశ్వత్ సచ్ దేవ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు.
కథ విషయానికి వస్తే .. అమిత్ రాథోడ్ - తులిక ప్రేమించుకుంటారు. అయితే ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా మరొకరితో ఎంగేజ్ మెంట్ జరుగుతుంది. తన ఫ్యామిలీతో కలిసి ఆమె 'రాంచీ' నుంచి 'ఢిల్లీ'కి ట్రైన్ లో వెళుతూ ఉంటుంది. ఆమెను సర్ ప్రైజ్ చేయడం కోసం హీరో ఆ ట్రైన్ ఎక్కుతాడు. ఆ తరువాత కొద్దీ సేపటికే ఆ ట్రైన్ లోకి 40 మంది బందిపోట్లు చొరబడతారు. అప్పుడు ఏం జరుగుతుందనేది కథ. ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.