పవన్ కల్యాణ్ మతాన్ని అడ్డుపెట్టుకుని జనాలను రెచ్చగొడుతున్నారు: పోతిన మహేశ్

  • పవన్ చేస్తున్నది ప్రాయశ్చిత దీక్ష కాదన్న పోతిన మహేశ్
  • పవన్ సనాతనధర్మం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శ
  • హిందూ దేవుళ్లపై పవన్ కు నమ్మకం ఉందా? అని ప్రశ్న
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత పోతిన మహేశ్ విమర్శలు గుప్పించారు. పవన్ చేస్తున్నది ప్రాయశ్చిత దీక్ష కాదని... రాజకీయ దీక్ష అని అన్నారు. ఏనాడూ టీటీడీ దేవాలయాలకు వెళ్లని పవన్ సనాతన ధర్మం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని చెప్పారు. 

ఏదైనా తప్పు జరిగితే బాధ్యత గల పదవిలో ఉన్నవారు సరిదిద్దాలని... కానీ, పవన్ మాత్రం మత విశ్వాసాలను అడ్డుపెట్టుకుని జనాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. హిందూ దేవుళ్లపై పవన్ కు నమ్మకం ఉందా? అని ప్రశ్నించారు.

ప్రాయశ్చిత దీక్షను ఎందుకు చేస్తారో పవన్ కు తెలుసా? అని పోతిన ప్రశ్నించారు. చేసిన తప్పును క్షమించమని ఈ దీక్షను చేస్తారని చెప్పారు. 

ఓ మైనర్ పై కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అఘాయిత్యం చేసినందుకు పవన్ ప్రాయశ్చిత దీక్ష చేయాలని చెప్పారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్నందుకు ప్రాయశ్చిత దీక్ష చేయాలని అన్నారు. చంద్రబాబు తప్పు చేసినందుకు ప్రాయశ్చిత దీక్ష చేయాలని చెప్పారు. హిందువుల మనోభావాలతో ఆటలాడితే వేంకటేశ్వరస్వామి చూస్తూ ఊరుకోరని స్పష్టం చేశారు.


More Telugu News