టీటీడీ పాలనా భవనం ఎదుట హిందూ ధార్మిక సంస్థల నేతల నిరసన
- తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం
- కొనసాగుతున్న ప్రకంపనలు
- నిరసన బాట పట్టిన ఏపీ సాధు పరిషత్, ఇతర హిందూ సంఘాలు
- సేవ్ తిరుమల, సేవ్ టీటీడీ నినాదాలతో తిరుపతిలో నిరసన
హిందువులకు పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి దివ్య ప్రసాదం లడ్డూ కల్తీ జరగడంపై ప్రకంపనలు కొనసాగుతున్నాయి. హిందూ ధార్మిక సంస్థల నేతలు నేడు తిరుపతిలోని టీటీడీ పాలనా భవనం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ హిందూ సాధు పరిషత్, ఇతర హిందూ సంఘాలకు చెందిన వారు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. సేవ్ తిరుమల, సేవ్ టీటీడీ అంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిని కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
కొందరు మహిళలు తిరుమల లడ్డూ కల్తీని వ్యతిరేకిస్తూ రోడ్డుపై పొర్లుదండాలు పెట్టారు. తిరుమల పవిత్రతను మంటగలిపేందుకు ప్రయత్నించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని వారు స్పష్టం చేశారు.