విద్యాశాఖకు మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- డీఎస్సీ ఫలితాల విడుదలపై జాప్యం
- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్స్ వేదికగా ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత
- జూలై 18 నుండి ఆగస్టు 5 వరకు జరిగిన డీఎస్సీ పరీక్షలు
- టీచర్ల అవసరం ఉందంటూ ప్రభుత్వం హడావుడిగా పరీక్షలు నిర్వహించిందన్న ఆర్ఎస్‌పీ
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం డీఎస్సీ ఫలితాల విడుదలపై చేస్తున్న జాప్యం విషయమై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రశ్నించారు. అసలు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు ఎవరు...? ఆయన ఏ ప్రపంచంలో సేదతీరుతున్నారు..? విద్యాశాఖ మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే ఫైర్ అయ్యారు.
ఉపాధ్యాయుల అవసరం ఉందంటూ హడావుడిగా పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఫలితాలు ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆగమేఘాల మీద డీఎస్సీ పరీక్షలు జూలై 18 నుండి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్ (సీబీటీ) లో నిర్వహించిందని, చాలా మంది అభ్యర్థులు వాయిదా వేయాలని వేడుకున్నా పట్టించుకోలేదని విమర్శించారు. తొందరగా టీచర్ల అవసరముందని ప్రభుత్వం హడావుడిగా పరీక్షలు నిర్వహించిందని ఆరోపించారు.
అంతా ఆన్‌లైన్ పరీక్ష అయినప్పుడు దీనికి సంబంధించిన నియామక భర్తీ ప్రక్రియ ఎందుకు నత్త నడకన సాగుతోంది అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. అభ్యర్థులకు ఫలితాలు తొందరగా ఇచ్చి, జనరల్ ర్యాంకింగ్స్ ప్రకటించి, నియామక పత్రాలు అందజేస్తే వారు త్వరగా బడులకు వెళ్లి పిల్లలకు పాఠాలు బోధిస్తారని ఆయన తెలిపారు.
వారం రోజుల్లో డీఎస్సీ ఫలితాలు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారని, అలాగే సెప్టెంబర్ 5వ తేదీ వరకు నియామకాలు చేపడుతామని కూడా హామీ ఇచ్చారని... కానీ అమలుకు నోచుకోవడం లేదని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్ర ఖజానాలోని సొమ్మును కొడంగల్, ఢిల్లీకి తరలించినట్లు అనిపిస్తుందని పేర్కొన్నారు.
అందుకే జీతాలకు డబ్బుల్లేక, గురుకుల టీచర్లకే ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ఇక డీఎస్సీ టీచర్లకు ఎక్కడ్నుంచి తీసుకొచ్చి ఇవ్వాలనే ధోరణిలో ప్రభుత్వం ఉందన్నారు.
హైడ్రా పేరుతో అందరి దృష్టి మళ్లించి, వచ్చే ఏడాది నియామక పత్రాలు ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తున్నట్లు అనిపిస్తుందని ఆయన తెలిపారు.