లడ్డూ ఇష్యూ... హీరో కార్తీ వ్యాఖ్యలపై పవన్ ఆగ్రహం
- కార్తీ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో లడ్డూ టాపిక్
- లడ్డూ మీద జోకులేస్తున్నారని పవన్ మండిపాటు
- సనాతన ధర్మానికి మద్దతుగా ఉండాలని హితవు
తమిళ హీరో కార్తీ కొత్త సినిమా 'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లడ్డూలపై జోకులు పేలడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూను ఉద్దేశించి కార్తీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
వివరాల్లోకి వెళితే... హీరో కార్తీ తాజా చిత్రం 'సత్యం సుందరం' ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో... 'లడ్డూ కావాలా నాయనా' అని కార్తీని యాంకర్ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఇప్పుడు లడ్డూ గురించి వద్దు... అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని కార్తీ చెప్పారు. 'మీకోసం మోతిచూర్ లడ్డూ తెప్పిస్తాం' అని యాంకర్ అడగడంతో... ఇప్పుడు లడ్డూ గురించి వద్దు అని కార్తీ నవ్వుతూ అన్నారు. ఈ సందర్భంగా అక్కడ నవ్వులు విరబూశాయి.
ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వాళ్లు మాట్లాడేటప్పుడు సనాతన ధర్మానికి మద్దతుగా మాట్లాడాలని... లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలని అన్నారు. లడ్డూ మీద నిన్న ఒక సినిమా ఫంక్షన్ లో జోకులేశారని... అలాంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. మీమీద తనకు గౌరవం ఉందని... మీ నటన తనకు నచ్చుతుందని చెప్పిన పవన్... ఒక మాట మాట్లాడే ముందు వెయ్యిసార్లు ఆలోచించుకోవాలని అన్నారు. సినీ ప్రేక్షకులు కూడా సనాతనధర్మాన్ని గౌరవించాలని... మీరు అభిమానించే హీరోలకంటే ధర్మం గొప్పదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.