'దేవర'తో ఓవర్సీస్‌లో తారక్ అరుదైన ఫీట్.. తొలి భారతీయ హీరోగా ఘనత!
- ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబోలో 'దేవర'
- ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సినిమా
- నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్‌లో 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిన 'దేవర'
- తద్వారా వరుసగా రెండు సినిమాలతో ఈ ఫిగర్‌ను దాటిన తొలి భారతీయ హీరోగా ఎన్‌టీఆర్
గ్లోబల్ స్టార్ ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం 'దేవర'. ఈ నెల 27న మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.
అయితే, విడుదలకు ముందే దేవర రికార్డులు సృష్టిస్తోంది. తద్వారా తాజాగా ఓవర్సీస్‌లో అరుదైన రికార్డును తారక్ తన ఖాతాలో వేసుకున్నాడు. నార్త్ అమెరికాలో దేవర ప్రీ సేల్స్‌లో 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. దీంతో వరుసగా రెండు సినిమాలతో ఈ ఫిగర్‌ను దాటిన తొలి భారతీయ హీరోగా అరుదైన ఘనతను ఎన్‌టీఆర్ సొంతం చేసుకున్నాడు. ఇక అమెరికాలో దేవర ప్రీమియర్స్ ఒకరోజు ముందుగానే ప్రారంభం కానున్నాయి. అక్కడ సెప్టెంబర్ 26న మూవీ ప్రీమియర్స్ పడనున్నాయి.
ఇక ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్స్, గ్లింప్స్, సాంగ్స్ దేవరపై అంచనాలు పెంచేశాయి. దీంతో మూవీపై సూపర్ హైప్ క్రియేట్ అయింది. సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తారక్ సరసన తొలిసారి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. అలాగే మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటించారు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ, మలయాళ నటుడు షైన్ టామ్ ఛాకో తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు.