ఐపీఎల్‌ 2025 వేలం.. ఈసారి ఫ్రాంచైజీలు విడుదల చేసే అవ‌కాశం ఉన్న ఐదుగురు సూపర్ స్టార్లు వీరే!

  • వ‌చ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం
  • ప్లేయ‌ర్ల రిటెన్ష‌న్‌పై ఎలాంటి మార్గదర్శకాలను విడుదల చేయని బీసీసీఐ 
  • 5-6 మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవ‌డానికి అనుమతించే అవ‌కాశమంటూ నివేదిక‌లు
  • ఫ్రాంచైజీలు చాలా మంది స్టార్ ప్లేయ‌ర్లను విడుద‌ల చేసే అవ‌కాశం
  • ఈ జాబితాలో  రోహిత్, రాహుల్, డుప్లెసిస్, వెంకటేశ్‌ అయ్యర్, మాక్స్‌వెల్
వ‌చ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం ఉన్న విష‌యం తెలిసిందే. ఇంకా ఫ్రాంచైజీలకు ప్లేయ‌ర్ల రిటెన్ష‌న్‌పై ఎలాంటి మార్గదర్శకాలను బీసీసీఐ విడుదల చేయలేదు. ఫ్రాంచైజీలు మాత్రం రైట్ టు మ్యాచ్‌ సహా తమ ప్రస్తుత జట్టులో ఆరు కంటే ఎక్కువ మంది ఆటగాళ్లను అంటిపెట్టుకోవడానికి అనుమతించాల‌ని బీసీసీఐని కోరుతున్నాయి. ఇందులో కొన్ని ఫ్రాంచైజీలైతే ఏకంగా 8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతించాలని అభిప్రాయ‌ప‌డ్డాయి. 

ఈ క్ర‌మంలో వివిధ ఫ్రాంచైజీలు వేలానికి ముందు అంటిపెట్టుకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్న‌ ఆటగాళ్లను హైలైట్ చేస్తూ ఇప్పటికే కొన్ని నివేదికలు వెలువడ్డాయి. ఈ నేప‌థ్యంలో 5-6 మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవ‌డానికి అనుమతించే అవ‌కాశం ఉండ‌డంతో చాలా మంది అగ్ర ప్లేయ‌ర్లు ఈసారి ఫ్రాంచైజీలు విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

ఇక మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు విడుదల చేసే అవ‌కాశం ఉన్న‌ 5 మంది స్టార్ ఆట‌గాళ్ల పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్, వెంకటేశ్‌ అయ్యర్, గ్లెన్ మాక్స్‌వెల్ ఈ జాబితాలో ఉన్నారు.     

రోహిత్ శర్మ: నిస్సందేహంగా ఈ జాబితాలో అతిపెద్ద పేరు రోహిత్ శ‌ర్మ‌దే. గత సీజ‌న్‌లో ముంబ‌యి ఇండియన్స్ ఈ స్టార్ ప్లేయ‌ర్ల‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించి హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. దీంతో ఈసారి హిట్‌మ్యాన్ విడుదలయ్యే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. దీనికి బ‌లం చేకూర్చింది అభిషేక్ నాయర్‌తో లీక్ అయిన చాట్‌. ఇందులో రోహిత్‌కు ముంబ‌యితో ఐపీఎల్‌ 2024 సీజన్ తన చివరి సీజన్ అని చెప్పడం వినవచ్చు. రోహిత్ కూడా ఆ జ‌ట్టుతో కొన‌సాగేందుకు ఆస‌క్తిగా లేడ‌ని కూడా అభిషేక్ చెప్పాడు. అందుకే ఈసారి వేలంలో హిట్‌మ్యాన్ ఉండ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే ఈ స్టార్ ప్లేయ‌ర్ కోసం ఫ్రాంచైజీలు పోటీ ప‌డ‌తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.  

కేఎల్‌ రాహుల్: లక్నో సూపర్ జ‌యింట్స్ (ఎల్ఎస్‌జీ) కొత్త కెప్టెన్‌ను నియ‌మించే యోచ‌న‌లో ఉంద‌ని స‌మాచారం. గ‌త సీజ‌న్‌లో ఫ్రాంచైజీ య‌జ‌మాని, రాహుల్ వ్య‌వ‌హారం కూడా బాగా వైర‌ల్ అయింది. దాంతో  ఈ స్టార్ ఆట‌గాడు ల‌క్నోతో ఉండేందుకు అంత‌గా ఆస‌క్తి చూపించ‌డంలేద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల ఓ అభిమానితో చాట్‌లోనూ రాహుల్ అలాంటి స‌మాధాన‌మే చెప్ప‌డం ఇందుకు నిద‌ర్శ‌నం. ప్ర‌స్తుతం ఈ ఫార్మాట్‌లో అత‌ని ఫామ్ కూడా ఒక స‌మ‌స్య‌గా ఉంది. ఇప్ప‌టికే భారత టీ20 జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ క్ర‌మంలో రాహుల్ తన పాత ఫ్రాంచైజీ అయిన‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కు తిరిగి వెళ్లాలని కొందరు సూచిస్తున్నారు.

ఫాఫ్ డుప్లెసిస్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గత సీజన్‌లో అనుకున్నంత‌గా రాణించ‌లేదు. పైగా 40 ఏళ్లు రావ‌డంతో ఈ సీనియ‌ర్ ప్లేయ‌ర్‌ను త‌ప్పించి కొత్త‌వారికి కెప్టెన్సీ ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో యాజ‌మాన్యం ఉంద‌ట‌. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క టైటిల్ కూడా ఆర్‌సీబీ గెల‌వ‌లేక‌పోయింది. దాంతో ఈసారి జ‌ట్టును పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అందుకే ఈ దక్షిణాఫ్రికా ఆటగాడిని వదులుకునే అవ‌కాశం ఉంది.

వెంకటేశ్‌ అయ్యర్: ఐపీఎల్ 2024 విజేత‌ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) ముందు ఒక పెద్ద స‌మ‌స్య‌ ఉంది. జ‌ట్టులో అంద‌రూ స్టార్ ప్లేయ‌ర్లు ఉండ‌డం, వేలానికి ముందు వారిలో 5 లేదా 6 మందిని ఖ‌రారు చేయ‌డం అనేది అంత సులువేమీ కాదు. సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, మిచెల్ స్టార్క్, శ్రేయాస్ అయ్యర్, ఫిల్ సాల్ట్‌ల‌ను మాత్ర‌మే ఫ్రాంచైజీ అంటిపెట్టుకునే అవ‌కాశం ఉంది. సో.. వెంకటేశ్‌ అయ్యర్ విడుద‌ల‌య్యే అవ‌కాశ‌మే ఎక్కువ‌గా ఉంది.

గ్లెన్ మాక్స్‌వెల్: ఐపీఎల్ 2024 సీజన్‌లో ఈ ఆర్‌సీబీ ఆట‌గాడు పేలవమైన ప్రద‌ర్శ‌న చేశాడు. ఏకంగా రూ.14.25కోట్లు పెట్టి కొన్న మాక్స్‌వెల్ ఆ స్థాయిలో ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. ఆంతో ఈసారి ఈ స్టార్ ప్లేయ‌ర్‌ను  ఫ్రాంచైజీ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.


More Telugu News