కొద్దిపాటి మార్పులతో కొత్త ఫోన్ తీసుకువచ్చిన శాంసంగ్
- ఎం సిరీస్‌లోనే కొద్దిపాటి మార్పులతో ఎం55 ఎస్ పేరిట కొత్త ఫోన్
- 8జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ. 19,999
- కోరల్ గ్రీన్, థండర్ బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి మొబైల్
- ఈ నెల 26 నుంచి మొబైల్ విక్రయాల ప్రారంభం
ప్రముఖ టెక్ సంస్థ శాంసంగ్ మరో కొత్త మొబైల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎం సిరీస్‌లోనే కొద్దిపాటి మార్పులతో ఎం55 ఎస్ (శాంసంగ్ గాలక్సీ ఎం55 ఎస్) పేరిట కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. గతంలో ఎం55, ఎఫ్ 55 ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చిన శాంసంగ్ ఇప్పుడు ఈ కొత్త మొబైల్‌ను కొద్దిగా మార్చి రిలీజ్ చేసింది.
మొత్తం మూడు వేరియంట్లలో కోరల్ గ్రీన్, థండర్ బ్లాక్ రంగుల్లో ఎం55 ఎస్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో 8జీబీ+256 జీబీ వేరియంట్ ధరను రూ. 19,999గా పేర్కొంది. మిగతా రెండు వేరియంట్ల ధరలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ఈ నెల 26 నుంచి ఈ మొబైల్ విక్రయాలు ప్రారంభం అవుతాయని శాంసంగ్ ప్రకటించింది.
అమెజాన్, శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, ఎంపిక చేసిన కొన్ని ఆఫ్‌లైన్ స్టోర్లలో ఫోన్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
ఎం55 ఎస్ ఫోన్ ఫీచర్లు ఇవే..

- 6.7 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
- ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్
- స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 1 ప్రాసెసర్
- 45వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 ఎంపీ బ్యాక్ కెమెరా
- 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్, 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్ ఫ్రంట్ కెమెరాలు
- ఫ్రంట్, బ్యాక్ కెమెరాలతో ఒకేసారి వీడియోను రికార్డు చేసే సదుపాయం