గాయనితో అఫైర్ ఉందా... జయం రవి ఏమన్నాడంటే...!

  • ఇటీవ‌ల భార్య ఆర్తితో విడాకుల ప్ర‌క‌ట‌న చేసి షాకిచ్చిన జ‌యం ర‌వి
  • త‌న‌కు చెప్ప‌కుండానే ఈ నిర్ణ‌యం తీసుకున్నాడంటూ ఆర్తి వ్యాఖ్య‌
  • జ‌యం ర‌వికి గాయ‌ని కెనీషాతో రిలేష‌న్ అంటూ పుకార్లు
  • ఆమెతో రిలేష‌న్ గురించి మాట్లాడ‌టం స‌మంజ‌సం కాద‌ని వివరణ  
త‌మిళ స్టార్ హీరో జ‌యం ర‌వి త‌న భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి అంద‌రికీ షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. 15 ఏళ్ల వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లుకుతున్న‌ట్లు చెప్పారు. అయితే, త‌న‌తో చెప్ప‌కుండానే ర‌వి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆ త‌ర్వాత ఆర్తి చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు ప్ర‌ముఖ గాయ‌ని కెనీషాతో రిలేష‌న్ ఉన్నందునే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. 

ఈ వ్య‌వ‌హారంపై 'బ్ర‌ద‌ర్' మూవీ ఆడియో లాంచ్‌లో జ‌యం ర‌వి వివ‌ర‌ణ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఎంతో క‌ష్ట‌ప‌డి నిర్మించుకున్న నా పేరును చెడగొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, దాన్ని అంత తేలిగ్గా జ‌ర‌గ‌నివ్వ‌ని తెలిపారు. ఆర్తితో మాట్లాడిన త‌ర్వాతే త‌న న్యాయ‌వాది ద్వారా విడాకుల నోటీసు పంపించ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. 

ఇప్పుడు ఆమె త‌న‌కేమీ తెలియ‌ద‌ని చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. జూన్‌లో నా కుమారుడు ఆరావ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా నేను చెన్నైలో ఉన్నాను. అత‌ని పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న ఫొటోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే, ఆ సమయంలోనే న‌న్ను వేరే ప్రాంతంలో చూశాన‌ని చెప్ప‌డం పూర్తిగా అవాస్త‌వం అని అన్నారు. 

త‌న పెద్ద కుమారుడికి డైవ‌ర్స్ విష‌యం అర్థ‌మ‌య్యేలా చెప్పిన‌ట్లు జ‌యం ర‌వి తెలిపారు. ఆ స‌మ‌యంలో ఆర‌వ్.. త‌ల్లి ఆర్తితో క‌లిసి జీవించాల‌ని కోరాడు. కానీ, అది కుద‌ర‌డం లేద‌ని అత‌నికి అర్థ‌మ‌య్యేలా వివ‌రించిన‌ట్లు చెప్పారు. 

ఇక గాయ‌ని కెనీషాతో త‌న‌కు ఉన్న రిలేష‌న్ గురించి మాట్లాడ‌టం స‌మంజ‌సం కాద‌న్నారు. ఆమె గాయ‌ని మాత్ర‌మే కాద‌ని సైకాలజిస్ట్ కూడా అని అన్నారు. ఆమెతో క‌లిసి భ‌విష్య‌త్‌లో ఒక వైద్య కేంద్రాన్ని తెర‌వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు జయం ర‌వి చెప్పుకొచ్చారు.


More Telugu News