సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు.. మీ ఎనలేని మద్దతుకు కృతజ్ఞతలు: ఎన్‌టీఆర్
- ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'దేవర' మూవీ
- సినిమా స్పెషల్ షో, టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
- టికెట్ ధర పెంపునకు అనుమతిస్తూ జీఓ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి తారక్ కృతజ్ఞతలు
ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'దేవర' మూవీ టికెట్ ధర పెంపునకు అనుమతినిస్తూ జీఓ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి హీరో జూనియర్ ఎన్‌టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రత్యేకంగా ఓ ట్వీట్ చేశారు.
"దేవర విడుదల కోసం కొత్త జీఓ జారీ చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మీరు అందిస్తున్న తిరుగులేని మద్దతుకు కృతజ్ఞతలు!" అని తారక్ ట్వీట్‌లో రాసుకొచ్చారు.
ఇక దేవర సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కడంతో టికెట్ ధరల పెంపునకు అనుమతినివ్వాలని మేకర్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దాంతో ఈ సినిమా టికెట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కొత్త జీఓను కూడా జారీ చేసింది.
మూవీ విడుదలైన రోజున టికెట్ ధరను రూ.100 పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ నెల 28వ తేదీ నుంచి అక్టోబర్ 6 వరకు అంటే తొమ్మిది రోజుల పాటు టిక్కెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.25, మల్టీప్లెక్స్‌లలో రూ.50 పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది.
అలాగే ఈ నెల 26న అర్ధరాత్రి ఒంటిగంట షోకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 29 థియేటర్లలో అర్ధరాత్రి ఒంటిగంట షోకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ షోకు టికెట్ ధరను రూ.100 మేర పెంచుకోవడానికి అనుమతించింది. దీంతో పాటు మొదటి రోజు వేకువజామున 4 గంటల నుంచి షోలు వేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది.
ఇదిలాఉంటే.. దర్శకుడు కొరటాల శివ, తారక్ కాంబోలో జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో దేవరపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్స్, గ్లింప్స్, సాంగ్స్ అంచనాలను మరింత పెంచేశాయి.