వరద బాధితులకు ఆర్థికసాయాన్ని పెంచిన ఏపీ ప్రభుత్వం

  • ఇటీవల వరద బాధితులకు ఆర్థికసాయం ప్రకటించిన కూటమి ప్రభుత్వం
  • ఈ నెల 17న చంద్రబాబు ప్రకటనకు అనుగుణంగా తాజా ఉత్తర్వులు
  • ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ఏపీ ప్రభుత్వం ఇటీవల వరద బాధితులకు ఆర్థికసాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా, ఆ ఆర్థికసాయాన్ని మరింత పెంచుతూ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ నెల 17న సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనకు అనుగుణంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా నేడు ఉత్తర్వులు జారీ చేశారు. 

ఎస్టీఆర్ఎఫ్ నిర్దేశించిన మొత్తం కంటే అదనంగా ఆర్థికసాయం అందించనున్నారు. 179 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఇళ్లు మునిగిన బాధితులకు లబ్ధి చేకూరనుంది. 

ఇళ్లు మునిగిన బాధితులకు రూ.11 వేలకు బదులు రూ.25 వేలు... మొదటి అంతస్తు వరద బాధితులకు రూ.5 వేలకు బదులు రూ.10 వేలు... వరదలకు ధ్వంసమైన దుకాణాలకు రూ.25 వేలు...  ఆర్థికసాయం అందించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

వాణిజ్య, వ్యాపార, ఎంఎస్ఎంఈ రంగాల్లోని వారికి కూడా సాయం అందిస్తామని, ఇళ్లు ధ్వంసమైన వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని ఉత్తర్వుల్లో వెల్లడించారు.


More Telugu News