మ‌ద్యం ధ‌ర‌లు త‌గ్గించి ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సందేశం ఇస్తున్నారు?.. విజ‌య‌సాయిరెడ్డి ఫైర్‌!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం మ‌ద్యం ధ‌ర‌లు త‌గ్గించి ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సందేశం ఇవ్వాల‌నుకుంటోంద‌ని వైసీపీ ఎంపీ, సీనియ‌ర్ నేత విజ‌య‌సాయిరెడ్డి ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు ఆయ‌న స్పెష‌ల్ ట్వీట్ చేశారు. 

"మెడిసిన్స్ లేదా విద్యా సంస్థ‌ల ఫీజుల‌ను త‌గ్గించ‌కుండా, మ‌ద్యం ధ‌ర‌ను (రూ.99/180ఎంఎల్‌) త‌గ్గించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇది మ‌ద్య‌పానాన్ని, గృహ హింస‌ను పెంచుతుంది. ప్ర‌జారోగ్యాన్ని మ‌రింత దిగ‌జారుస్తుంది. కూట‌మి ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త‌ల‌పై సందేహం క‌లుగుతోంది" అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.


More Telugu News