శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం.. తిరుమల ఆలయంలో శాంతి హోమం
- దేశవ్యాప్తంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం ప్రకంపనలు
- ఈ ఘటన నేపథ్యంలో ఆలయంలోని యాగశాలలో అర్చకుల శాంతి హోమం
- శ్రీవారి లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో దోషం వల్ల అపచారం కలిగిందన్న ఈఓ శ్యామలరావు
- దీనికి ప్రాయశ్చిత్తంగా హోమం నిర్వహిస్తున్నట్లు వెల్లడి
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. జాతీయ స్థాయిలో దీనిపై చర్చ జరుగుతోంది. ఇటు ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిదే. అయితే, శ్రీవారి లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఆలయంలోని యాగశాలలో అర్చకులు శాంతి హోమం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల వరకు టీటీడీ శాంతి హోమం నిర్వహించనుంది.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి పాల్గొంటున్నారు. వెంకటేశ్వరుడి లడ్డూ తయారీకి వాడే ఆవు నెయ్యిలో దోషం వల్ల అపచారం కలిగిందని ఈఓ శ్యామలరావు అన్నారు. దీనికి ప్రాయశ్చిత్తంగా హోమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హోమం ముగిసిన తర్వాత అన్ని పోటుల్లోనూ సంప్రోక్షణ చేస్తామని వెల్లడించారు.