దుర్గాపూజ నేపథ్యంలో ఫుల్ డిమాండ్.. హిల్సా చేపల ఎగుమతులపై నిషేధం ఎత్తివేసిన బంగ్లాదేశ్

  • ఈ నెల మొదట్లో హిల్సా చేపలపై బంగ్లాదేశ్ నిషేధం
  • భారత్‌కు 3 వేల టన్నుల హిల్సా చేపల ఎగుమతికి గ్రీన్ సిగ్నల్
  • రానున్న దుర్గాపూజల నేపథ్యంలో హిల్సా చేపలకు ఇరు దేశాల్లోనూ భారీ డిమాండ్
ఇండియాకు హిల్సా చేపల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని బంగ్లాదేశ్ ఎత్తివేసింది. 3 వేల టన్నుల చేపల ఎగుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల దేశంలో చెలరేగిన అల్లర్లు, షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన నేపథ్యంలో ఈ నెల మొదట్లో  హిల్సా చేపల ఎగుమతులను నిషేధించింది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు మారడం, రానున్న దుర్గా పూజల నేపథ్యంలో హిల్సా చేపలకు ఇండియాలో భారీ డిమాండ్ ఉండడంతో బంగ్లాదేశ్ తాజాగా ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసింది.

బంగ్లాదేశ్‌తోపాటు ఇండియాలోనూ హిల్సా చేపలు ప్రసిద్ధికెక్కాయి. దుర్గాపూజ సమయంలో ఇది మరింత రుచికరమైన వంటగా పరిగణిస్తారు. ఇరు దేశాల్లోనూ లక్షలాది మంది దుర్గాపూజ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో హిల్సా చేపలకు భారీ డిమాండ్ ఉంటుంది. ప్రపంచంలోని హిల్సా చేపల ఉత్పత్తిలో 70 శాతం ఒక్క బంగ్లాదేశ్ నుంచే ఉత్పత్తి అవుతుంది. అంతేకాదు, హిల్సా బంగ్లాదేశ్ జాతీయ చేప.


More Telugu News