కూకట్‌పల్లిలో హైడ్రా కూల్చివేతలు.. భారీగా పోలీసుల మోహరింపు

  • మళ్లీ మొదలైన హైడ్రా కూల్చివేతలు
  • ఈసారి కూకట్‌పల్లి నల్లచెరువుకు తరలిన హైడ్రా బుల్డోజర్లు
  • 27 ఎకరాల చెరువులో ఏడెకరాల ఆక్రమణ
  • నివాస భవనాలను మినహాయించి షెడ్లను కూల్చేస్తున్న అధికారులు
కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది. ఈసారి హైడ్రా బుల్డోజర్లు కూకట్‌పల్లి నల్ల చెరువుకు చేరుకున్నాయి. 27 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురైంది. దీంతో ఇక్కడ కూల్చివేతలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు.

చెరువులోని ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఏడెకరాలు ఆక్రమణలకు గురైనట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. బఫర్‌జోన్‌లలోని నాలుగెకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్ట్‌మెంట్లు నిర్మించారు. అలాగే, ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నట్టు గుర్తించిన అధికారులు కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా ముందే చెప్పినట్టు నివాసం ఉంటున్న భవనాలను కాకుండా ఖాళీగా ఉన్న షెడ్లను కూల్చివేస్తున్నారు.


More Telugu News