అమెరికాలో సోదరుడి వివాహ వేడుకలో ఫ్యామిలీతో జాలీగా సమంత

  • విస్కాన్సిన్‌లోని లేక్ జెనీవాలో సోదరుడి వివాహం
  • ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన సమంత
  • తల్లి, సోదరుడితో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్న నటి
ప్రముఖ నటి సమంత తన సోదరుడి వివాహ వేడుకలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపింది. సోదరుడు డేవిడ్ వివాహం అమెరికాలోని విస్కాన్సిన్‌లో గల లేక్ జెనీవాలో జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను సమంత సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తన తల్లి నిన్నెట్ ప్రభు, సోదరుడితో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంది.

ఈ ఫొటోలో సమంత పర్బుల్ స్లీవ్‌లెస్ గౌన్ ధరించింది. తన కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలు సమంత అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా కనిపించింది. ఆమె స్నాప్‌చాట్‌లో ఈ పెళ్లికి స్వాగతిస్తున్నట్లుగా కూడా ఓ బోర్డు ఉంది. "ఈ పెళ్లికి హాజరయినందుకు మాకు ఆనందంగా ఉంది... ఇట్లు డేవిడ్, నికోల్, మా వివాహానికి స్వాగతం" అని రాసి ఉంది. సమంత ఇన్‌స్టాలో ఈ ఫొటోలను షేర్ చేస్తూ వైట్ హర్ట్, స్పార్కిల్ ఎమోజీలతో పాటు 'ఫ్యామిలీ' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

సమంత 2010లో నాగచైతన్యతో కలిసి నటించిన 'ఏమాయ చేసావే'తో తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత వివిధ భాషల్లో నటించింది. తెలుగులో బృందావనం, దూకుడు, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, రాజుగారి గది 2, ఓహ్ బేబీ, యశోద, శాకుంతలం వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

విజయ దేవరకొండ హీరోగా వచ్చిన ఖుషీ సినిమాలో సమంత చివరిసారి కనిపించింది. ఆ తర్వాత స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్‌' రెండో సీజన్‌లో రాజీ పాత్రను పోషించింది. సమంత నటించిన 'హానీ బన్నీ' రాబోతుంది. ఈ సినిమాను నవంబర్ 7న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


More Telugu News