తిరుమల లడ్డూ వ్యవహారంపై రఘురామకృష్ణరాజు ఏమన్నారంటే...!
- తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన ఆర్ ఆర్ ఆర్
- తిరుమల లడ్డు ప్రసాదంపై రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు
- ఆవు నెయ్యి లోనే కల్తీ జరిగిందని నిర్ధారణ అయిందన్న రఘురాజు
తిరుపతి లడ్డూ వివాదం ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం సృష్టిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రేడ్ మార్క్ లడ్డూ నాణ్యతపై వినిపిస్తున్న వార్తలతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తిరుమల దేవస్థానానికి ఉన్న విశిష్టత దృష్ట్యా, అక్కడి ప్రసాదం స్వీకరిండాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు.
మరోవైపు తిరుమలలో లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ "లడ్డూ తయారీకి వాడే ఆవు నెయ్యిలో పందికి సంబంధించిన కొవ్వు, అలాగే మటన్ లో ఉండే టాలో అనే కొవ్వు పదార్థం కలిసినట్టు లేబరేటరీ టెస్టుల్లో నిర్ధారణ కూడా జరిగింది. ఒకరిద్దరు కాంట్రాక్టర్లను కూడా బ్లాక్ లిస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ వార్త బయటకు రావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.
కొన్ని చానల్స్ ముఖ్యంగా బ్లూ ఛానల్స్ ని మినహాయిస్తే మిగతా అన్ని చానల్స్ ఇదే వార్తను టేకప్ చేసి నిజానిజాలు ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందన్నమాట వాస్తవం. అందులో ఎలాంటి అనుమానం లేదని ఈవో కూడా స్టేట్ మెంట్ ఇచ్చారు" అని రఘురామ తెలిపారు.