'యథా రాజా తథా పోలీసులు' అన్నట్లుగా ఉంది: హరీశ్ రావు
- కొందరి తీరు కారణంగా తెలంగాణ పోలీస్ బ్రాండ్‌కు అవినీతి మకిలి పట్టిందన్న మాజీ మంత్రి
- రాష్ట్రంలో ప్రభుత్వం దారిలో పోలీసులు నడుస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్య
- సీనియర్ పోలీస్ అధికారులు పునరాలోచించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచన
కొందరు పోలీసు అధికారుల తీరు 'యథా రాజా తథా పోలీసులు' అన్నట్లుగా ఉందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ బ్రాండ్‌కు కొందరి తీరు కారణంగా అవినీతి మకిలిపడితే సీనియర్ పోలీస్ అధికారులు పడిన శ్రమ వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారి ఈ విషయాన్ని తెలంగాణ సీనియర్ పోలీస్ అధికారులు పునరాలోచించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు హరీశ్ రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
యువ అధికారులకు ప్రభుత్వాలు ఆదర్శంగా ఉండి... వాళ్లకు పని పట్ల నిబద్ధత, ప్రజా సేవ పట్ల అంకితభావాన్ని నేర్పించాలని హితవు పలికారు. కానీ రాష్ట్రంలో రాజు తీరుగా పోలీసులు ఉన్నారన్నట్లుగా పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ఆలోచనలతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగాన్ని గత పదేళ్ల కాలంలో దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దామన్నారు. ఆ ప్రక్రియలో ఎందరో తెలంగాణ సీనియర్ ఐపీఎస్ పోలీస్ అధికారుల అనుభవంతో కూడిన పాత్ర కచ్చితంగా ఉందని ప్రశంసించారు.