పీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్

  • అసెంబ్లీ కమిటీ హాలులో పీఏసీ సమావేశం
  • అరికెపూడి గాంధీని చైర్మన్‌గా నియమించడంపై బీఆర్ఎస్ నిరసన
  • పీఏసీ ఎంపిక తీరును నిరసిస్తూ బహిష్కరించినట్లు వెల్లడి
బీఆర్ఎస్ సభ్యులు పీఏసీ సమావేశాన్ని బహిష్కరించారు. తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాలులో పీఏసీ సమావేశం జరిగింది. పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, పీఏసీ సభ్యులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశాన్ని ప్రతిపక్షం బహిష్కరించింది.

పార్టీ ఫిరాయించిన అరికెపూడి గాంధీని చైర్మన్‌గా నియమించడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గాంధీ నియామకంపై మంత్రి శ్రీధర్ బాబును బీఆర్ఎస్ సభ్యులు నిలదీశారు. పీఏసీ అధ్యక్ష పదవి ప్రతిపక్షానికి ఇవ్వాలని, కానీ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 

పీఏసీ చైర్మన్ ఎంపిక తీరును నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించినట్లు బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అప్రజాస్వామికంగా పీఏసీ చైర్మన్ ఎన్నిక జరిగిందన్నారు.


More Telugu News