తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారం... త‌మిళ‌నాడు ఎన్‌టీకే పార్టీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

  • దేశ‌వ్యాప్తంగా శ్రీవారి లడ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారం ప్ర‌కంప‌న‌లు
  • జాతీయ స్థాయిలో ఈ వ్య‌వ‌హారంపై చ‌ర్చ‌
  • ఈ వ్య‌వ‌హారంపై స్పందిస్తున్న అధికారులు, రాజ‌కీయ నేత‌లు, ప్ర‌ముఖులు
  • ల‌డ్డూ త‌ప్ప దేశంలో ఇక ఏ స‌మ‌స్య‌లు లేవా? అంటూ మండిప‌డ్డ‌ ఎన్‌టీకే పార్టీ చీఫ్‌ సీమాన్  
  • క‌ల్తీ ల‌డ్డూ తిని ఎవ‌రైనా చ‌నిపోయారా? అని వ్యాఖ్య‌
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం క‌ల్తీ వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా క‌ల‌కలం సృష్టిస్తోంది. ల‌డ్డూ త‌యారీకి జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యి వాడారన్న వార్త ఇప్పుడు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. జాతీయ స్థాయిలో దీనిపై చ‌ర్చ‌ జరుగుతోంది. ఇటు ఈ వ్య‌వ‌హారం రాష్ట్ర రాజ‌కీయాల్లోనూ తీవ్ర దుమారం రేపుతోంది. 

ఇక ఈ వ్య‌వ‌హారంపై దేశ‌వ్యాప్తంగా అధికారులు, రాజ‌కీయ నేత‌లు, ప‌లువురు ప్ర‌ముఖులు స్పందిస్తున్నారు. తాజాగా త‌మిళ‌నాడుకు చెందిన ఎన్‌టీకే పార్టీ చీఫ్ సీమాన్ కూడా స్పందిస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

ల‌డ్డూ త‌ప్ప దేశంలో ఇంకా ఏ స‌మ‌స్య‌లు లేవా? అని ఫైర్ అయ్యారు. క‌ల్తీ ల‌డ్డూ తిని ఎవ‌రైనా చ‌నిపోయారా? అని ప్ర‌శ్నించారు. క‌ల్తీ జ‌రిగితే సంబంధిత వ్య‌క్తుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి. అంతేగాని ల‌డ్డూ, బూందీ అంటూ రాజ‌కీయాలు చేయ‌డం ఏంట‌ని? మండిప‌డ్డారు. ఈ విష‌యంపై కావాల‌నే వివాదం సృష్టిస్తున్నార‌ని సీమాన్ చెప్పుకొచ్చారు.


More Telugu News