విచారణ జరిపించండి... ఆ తర్వాత మాట్లాడండి: బొత్స సత్యనారాయణ
- దేవుడిని రాజకీయాలకు వాడుకోవడం చంద్రబాబుకు అలవాటేనన్న బొత్స
- లడ్డూ అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్
- దేవుడి ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని వ్యాఖ్య
తిరుమల లడ్డూ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. దేవుడిని రాజకీయాలకు వాడుకోవడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు.
లడ్డూ అంశంపై విచారణ జరిపించాలని... విచారణలో వాస్తవాలు వెలుగు చూసిన తర్వాతే మాట్లాడాలని చెప్పారు. విచారణలో ఎవరైనా దోషులుగా తేలితే వారిని శిక్షించాలని అన్నారు. లడ్డూ అంశంపై చంద్రబాబు చెపుతున్న దానికి, టీటీడీ ఈవో చెపుతున్న దానికి పొంతన లేదని చెప్పారు.
కూటమి వంద రోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని... దీన్నించి ప్రజలను డైవర్ట్ చేసేందుకే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. దేవుడి ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. దేవుడితో ఆటలాడితే ఎప్పటికైనా శిక్ష తప్పదని హెచ్చరించారు.
చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకుంటోందని చెప్పారు. విజయవాడ వరదల్లో నిజంగా ఎంతమంది చనిపోయారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.