ఓటీటీలోకి నాని కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..!
- నెట్ ఫ్లిక్స్ లోకి సరిపోదా శనివారం మూవీ
- ఈ నెల 26 నుంచి తెలుగు సహా వివిధ భాషల్లో ప్రసారం
- అధికారికంగా ప్రకటించిన నెట్ ఫ్లిక్స్
హీరో నాని కొత్త సినిమా ‘సరిపోదా శనివారం’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 26 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ప్రసారం చేయనున్నట్లు వెల్లడించింది. ఈమేరకు నెట్ ఫ్లిక్స్ తాజాగా ట్వీట్ చేసింది. ‘ఇప్పటి వరకు రెండు కళ్లే చూశారు. మూడో కన్ను చూడటానికి మీరు రెడీగా ఉన్నారా?' అనే పవర్ ఫుల్ క్యాప్షన్‌ను జత చేసింది.
నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో రూపుదిద్దుకున్న ‘సరిపోదా శనివారం’ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటించారు. ఎస్ జే సూర్య ప్రత్యేక పాత్రలో కనిపించాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తెరకెక్కించింది. గత నెలాఖరున (ఆగస్టు 29న) థియేటర్లలో విడుదలైన సరిపోదా శనివారం భారీ వసూళ్లను రాబట్టింది. కేవలం పది రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలియడంతో నాని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.