హైపర్ ఆది విరాళం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు చెక్ అందజేత
- ఇటీవల ఏపీ, తెలంగాణను ముంచెత్తిన భారీ వరదలు
- వరద బాధితుల కోసం పలువురు ప్రముఖులు, సెలబ్రిటీల విరాళాలు
- రూ. 3లక్షల విరాళం ప్రకటించిన హైపర్ ఆది
ఇటీవల భారీ వరదలు ఏపీ, తెలంగాణను ముంచెత్తిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరం అస్తవ్యస్తమైంది. దాంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు తమవంతు సాయంగా విరాళాలు అందజేశారు.
తాజాగా జబర్దస్త్ షో కమెడియన్ హైపర్ ఆది కూడా విరాళం ఇచ్చారు. రూ. 3లక్షల విరాళం తాలూకు చెక్‌ను ఆయన స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అందజేశారు. ఇక తాను ఇచ్చిన ఈ మూడు లక్షల్లో వరద పీడిత గ్రామమైన ఏకే మల్లవరం (పిఠాపురం నియోజకవర్గం) కు రూ. 1లక్ష ఇవ్వాలని, మిగతా రెండు లక్షలు తన సొంత గ్రామం పల్లాపల్లి గ్రామ పంచాయతీకి ఇవ్వాలని ఆది కోరారు.
ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ.. వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు రూ. 6కోట్ల విరాళం ఇచ్చి జనసేనాని పవన్ కల్యాణ్ అందిరిలో స్ఫూర్తిని నింపారని అన్నారు. ఆ స్ఫూర్తితోనే నేరుగా పంచాయతీలకు విరాలం ఇవ్వొచ్చని తెలిసి తన వంతుగా రూ. 3లక్షలు ఇచ్చానని ఆది తెలిపారు.
కాగా, వరద బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా పవన్ రూ.6 కోట్లు విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌లకు చెరో రూ.కోటి చొప్పున అందజేశారు. అలాగే ఏపీలోని 400 పంచాయతీలకు రూ.4 కోట్లు ప్రకటించారు. వీటిలో ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున ఇవ్వనున్నారు.