జానీ మాస్టర్ భార్య ఆయేషా అరెస్ట్ తప్పదా..!
- మహిళా కొరియోగ్రాఫర్ పై దాడి కేసులో చర్యలు
- ఆయేషాతో పాటు మరో ఇద్దరిని నిందితులుగా చేర్చే అవకాశం
- బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న జానీ మాస్టర్ లాయర్
మహిళా కొరియోగ్రాఫర్ పై అత్యాచారం కేసులో జానీ మాస్టర్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ భార్య ఆయేషా కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆయేషా తనపై దాడి చేసిందని అత్యాచార బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై మరోకేసు నమోదు చేసి ఆయేషాతో పాటు మరో ఇద్దరిని నిందితులుగా చేర్చాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఆయేషాను అరెస్టు చేయడం ఖాయమని న్యాయ వర్గాలు చెబుతున్నాయి.
జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడిన సమయంలో బాధితురాలి వయసు 19 సంవత్సరాలని తేలడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గోవాలో ఆయనను అరెస్టు చేసిన పోలీసులు.. చంచల్ గూడ జైలుకు తరలించారు. శనివారం ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్‌ని కస్టడీకి కోరుతూ నార్సింగి పోలీసులు పిటిషన్ వేయనున్నారు. పది రోజులపాటు కస్టడీకి కోరే అవకాశం ఉంది. రిమాండ్ రిపోర్టుతో పాటు లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన 40పేజీల ఫిర్యాదులోని కీలక అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ లాయర్ ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.