అనిరుధ్‌తో కలిసి డ్యాన్స్ వేసిన రజనీకాంత్
- చెన్నయ్‌లో ఘనంగా జరిగిన 'వేట్టయాన్' సినిమా ఆడియో వేడుక
- ఇది అందరికి కనెక్ట్ అయ్యే యూనివర్శల్ పాయింట్ అన్న రజనీకాంత్
- జైలర్‌కు మించిన విజయం సాధిస్తుందని ధీమా
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంతో పాటు టి.జె. జ్ఞానవేల్ డైరెక్షన్‌లో 'వేట్టయాన్' చిత్రంలో నటిస్తున్నాడు. వీటిలో 'వేట్టయాన్' చిత్రం అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని శుక్రవారం చెన్నయ్‌లో నిర్వహించారు. ఎంతో సందడిగా జరిగిన ఈ వేడుకలో రజనీకాంత్, సంగీత దర్శకుడు అనిరుధ్ కలిసి వేసిన డ్యాన్స్ మూమెంట్స్ ఆ ఫంక్షన్‌కు ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ 'ఇది అందరికి కనెక్ట్ అయ్యే యూనివర్శల్ పాయింట్‌తో తీసిన సినిమా. ఏదైనా మేసేజ్ ఓరియెంటెడ్ కథతో సినిమా చేయాలని అనుకుంటున్నప్పుడు దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ ఈ కథను చెప్పాడు. అన్ని ఎమోషన్స్‌తో కూడిన ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలు కూడా వున్నాయి. సాధారణంగా ఇంతకు ముందు సినిమా సక్సెస్ కాకపోతే తదుపరి సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలి అనే ఒత్తిడి వుంటుంది. ఇక ఈ సినిమా నాకు ఓ విజయవంతమైన చిత్రం తరువాత వచ్చే సినిమా కావడంతో, ఇంతకు ముందు సినిమాను మించి విజయం సాధించాలి అనే టెన్షన్ వుంది. ప్రస్తుతం నేను అలాంటి మూమెంట్‌లోనే వున్నాను.
నా గత చిత్రం జైలర్‌కు మించిన ప్రేక్షకాదరణ ఈ సినిమాకు వుంటుందనే నమ్మకం వుంది. ఈ సినిమాకు అనిరుధ్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా వుంటుంది. ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన రోజే అక్టోబర్ 10న విడుదల చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. అయితే వాళ్లకు వున్న ఫైనాన్షియల్ టెన్షన్స్ కారణంగా అధికారికంగా ముందుగా ప్రకటించలేకపోయారు' అన్నారు. వేట్టయాన్‌లో నటిస్తున్న అమితాబ్ బబ్చన్ ఈ వేడుకకు హాజరుకాలేకపోయినా ఆయన వీడియో మేసేజ్ పంపారు. దాదాపు 30 సంవత్సరాల తరువాత రజనీకాంత్, అమితాబ్‌లు కలిసి ఈ సినిమాలో నటించడం విశేషం.