నైపుణ్యానికి టాలెంట్ తోడైతే బుమ్రా లాంటి భయంకర బౌలర్​ను చూస్తాం: తమీమ్ ఇక్బాల్

  • జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ నైపుణ్యం అత్య‌ద్భుతం అన్న బంగ్లా ప్లేయ‌ర్‌
  • బుమ్రాకు నమ్మశక్యం కాని నైపుణ్యంతో పాటు మంచి ఆలోచన విధానం కూడా ఉందంటూ కితాబు
  • ఈ రెండింటి కలయిక అతి భయంకరమైందన్న త‌మీమ్ ఇక్బాల్‌
  • దీన్ని ప్రస్తుతం ప్రపంచం చూస్తోందని ప్ర‌శంస‌
భార‌త జ‌ట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ నైపుణ్యం గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. వ‌ర్త‌మాన బౌల‌ర్ల‌లో ఈ పేస‌ర్‌ను అధిగ‌మించే మ‌రో బౌల‌ర్ లేడంటే అతిశ‌యోక్తి కాదు. అస‌లు ఎప్పుడు ఎలాంటి బాల్ విసురుతాడోన‌ని ప్ర‌పంచ అగ్ర‌శ్రేణి బ్యాట‌ర్లు సైతం క‌న్ఫ్యూజ్ అవుతుంటారు. కీల‌క స‌మ‌యాల్లో వికెట్లు తీసి జ‌ట్టును ఒంటిచేత్తో గెలిపించ‌డంలో బుమ్రా త‌న‌కుతానే సాటి.

ప్ర‌స్తుతం స్వ‌దేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టులో కూడా అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు కీల‌క‌ వికెట్లు ప‌డ‌గొట్టి ప్ర‌త్య‌ర్థి బంగ్లా పతనాన్ని శాసించాడు. ఈ క్రమంలోనే బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 400 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. ఈ స్టార్ పేస‌ర్‌పై బంగ్లాదేశ్ స్టార్ ఆట‌గాడు తమీమ్ ఇక్బాల్ తాజాగా ప్రశంసల జ‌ల్లు కురిపించాడు. నైపుణ్యానికి టాలెంట్ తోడైతే బుమ్రా లాంటి భయంకర బౌలర్ ని చూస్తామని తమీమ్ పేర్కొన్నాడు.

"జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ గురించి చెప్పాలంటే, నమ్మశక్యం కాని నైపుణ్యంతో పాటు ‌అంతే నమ్మశక్యం కాని ఆలోచన విధానం కూడా అతని సొంతం. మీకు ఎంత నైపుణ్యమైనా ఉండచ్చు, కానీ తెలివైన ఆలోచనా విధానం లేకపోతే కనుక బుమ్రాలా విజ‌యవంతం కాలేరు. ఈ రెండింటి కలయిక అతి భయంకరమైంది. ప్రస్తుతం ప్రపంచం దీనిని చూస్తోంది" అని తమీమ్ ఇక్బాల్ తెలిపాడు.


More Telugu News