తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ!
- రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
- ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరిక
రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
శనివారం నాడు కొత్తగూడెం, నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు ఆదిలాబాద్, మంచిర్యాల, జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
అలాగే ఆదివారం నాడు నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, ఆసిఫాబాద్, వికారాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇక సోమవారం నాడు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, మహబూబాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల, నారాయణపేట ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.