కుమార్తెకు కానుకలు ఇచ్చిన పవన్ కల్యాణ్
- లేపాక్షి సంస్థ ప్రదర్శించిన చేనేత, కలంకారి వస్తువులను కుమార్తె ఆద్యతో కలిసి తిలకించిన డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్
- కుమార్తె ముచ్చటపడిన వస్తువులను కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చిన పవన్
- ప్రభుత్వ అతిధులకు బహుమతులుగా హస్త కళాకారుల కళాకృతులు గిఫ్ట్ హ్యాంపర్‌లుగా సిద్దం చేయాలన్న డిప్యూటి సీఎం
జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన కుమార్తె ఆద్య ముచ్చటను తీర్చారు. లేపాక్షి సంస్థ ప్రదర్శించిన కళా కృతులను శుక్రవారం తన కుమార్తె ఆద్యతో కలిసి పవన్ కల్యాణ్ తిలకించారు. అందులో కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగ్, కొయ్య బొమ్మలు చూసి ఆద్య ముచ్చటపడింది. కుమార్తె ముచ్చట పడటంతో పవన్.. వెంటనే ఆ కళాకృతులను కొనుగోలు చేసి ఆద్యకు కానుకగా అందించారు. వాటికి బిల్లును స్వయంగా పవన్ కల్యాణ్ చెల్లించారు.
ఇదే సందర్భంలో పవన్ కల్యాణ్ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వ అతిధులకు జ్ఞాపికలుగా హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు ఇచ్చి సత్కరించాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా రాష్ట్ర కళాసంపదకు ప్రాచుర్యం అందించడంతోపాటు హస్త కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. ఎంపిక చేసిన వాటితో గిఫ్ట్ హ్యాంపర్ సిద్ధం చేయించి వాటిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముద్ర, అందులో కళాకృతుల వివరాలతో కూడిన కార్డు ఉంచాలని పవన్ సూచించారు.
అతిథుల గౌరవార్థం ఇచ్చే జ్ఞాపికలు, శాలువాలకు శాఖాపరంగా ఇచ్చే బడ్జెట్‌లో 40 శాతం మాత్రమే తీసుకోవాలని, మిగిలిన 60 శాతం తన సొంత సొమ్ముతో కళాకృతులతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్స్ సిద్ధం చేయాలని పేషీ అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.