మురుగన్ టీ స్టాల్ లో చాయ్ తాగి నాటి స్మృతులను నెమరు వేసుకున్న మంత్రి లోకేశ్
- యువగళం జ్ఞాపకాలను నెమరువేసుకున్న లోకేశ్
- నేడు చిత్తూరు జిల్లాలో పర్యటన
- గాదంకి టోల్ గేట్ వద్ద ఆగిన లోకేశ్ కాన్వాయ్
- గతంలో ఇక్కడ టీ తాగిన విషయాన్ని గుర్తు చేసిన పులివర్తి నాని
రాష్ట్ర రాజకీయాల్లో సంచలన ఘట్టాలను నమోదు చేసిన చారిత్రాత్మక యువగళం నాటి అనుభవాలను యువనేత నారా లోకేశ్ మర్చిపోలేదు. మంత్రిగా చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన లోకేశ్ ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
బంగారు పాళ్యం పర్యటన ముగించుకొని తిరిగి రేణిగుంట ఎయిర్ పోర్టుకు వెళుతున్నప్పుడు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. యువగళం పాదయాత్ర సాగే సమయంలో గాదంకి టోల్ గేట్ వద్దకు చేరుకున్నప్పుడు లోకేశ్ అక్కడ ఆగి టీ తాగారు.
శుక్రవారం నాడు కాన్వాయ్ గాదంకి టోల్ గేట్ వద్దకు చేరుకున్నప్పుడు ఈ విషయాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని... మంత్రి లోకేశ్ కు గుర్తుచేశారు. వెంటనే కాన్వాయ్ ని ఆపిన మంత్రి లోకేశ్ గ్రామ పార్టీ అధ్యక్షుడు రమేశ్ కు చెందిన మురుగన్ టీ స్టాల్ లోకి వెళ్లారు. కార్యకర్తలతో కలిసి చాయ్ తాగి యువగళం నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కుశల ప్రశ్నలు వేశారు. బిజీ షెడ్యూల్లో సైతం దాదాపు అర్థగంట పాటు అక్కడి కార్యకర్తల కోసం కేటాయించడంతో వారు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు.