తక్కువ ధరకే వస్తోందని కల్తీ నెయ్యి కొంటారా?: పవన్ కల్యాణ్
- తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పవన్ స్పందన
- లడ్డూ కల్తీ వ్యవహారం దిగ్భ్రాంతి కలిగించిందని వెల్లడి
- తాము అధికారంలోకి వచ్చాక టీటీడీలో ప్రక్షాళన చేపట్టామని వివరణ
తిరుమల లడ్డూ కల్తీ అయిందన్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తిరుమల వెంకటేశ్వరస్వామి వారి లడ్డూ కల్తీ అయిందని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. స్వచ్ఛమైన నెయ్యి ఎక్కువ ధర ఉంటుందని, తక్కువ ధరకే వస్తోందని కల్తీ నెయ్యి ఎలా కొంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ల్యాబ్ లో లడ్డూ నాణ్యత పరీక్షించాలని ప్రజలు కోరారని వివరించారు. ప్రజల మనోభావాలతో ఎవరూ చెలగాటం ఆడొద్దని పవన్ హితవు పలికారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీలో ప్రక్షాళన చేపట్టామని అన్నారు. ఫిర్యాదులు వస్తున్నా టీటీడీ గత చైర్మన్, గత ఈవో పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజల మనోభావాలను గౌరవించకుండా ఆలయ పవిత్రత దెబ్బతీశారని పవన్ విమర్శించారు.