సముద్ర తీరంలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన అభిషేక్ బచ్చన్!
- ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్ కొన్న అభిషేక్ బచ్చన్
- వ్యాపారరంగంలో విజయవంతం
- అపార్ట్మెంట్ ఖరీదు రూ.40 కోట్లు అంటూ వార్తలు
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితా బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ మధ్యకాలంలో అరుదుగా సినిమాలు చేస్తున్నారు. అభిషేక్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లోను సైతం చేయడం విశేషం. సినిమాలు వెబ్ సిరీస్ లలో వచ్చే ఆదాయం తక్కువగా ఉన్నా, ఆయన చేస్తున్న వ్యాపారాలు మాత్రం సూపర్ హిట్ అవుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే బచ్చన్ ఫ్యామిలీ ముంబైలో పలు ఏరియాలో ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేయడం జరిగింది తాజాగా మరో ఖరీదైన అపార్ట్మెంట్ ను అభిషేక్ కొనుగోలు చేసినట్లు సమాచారం.
ముంబైలో బచ్చన్ ఫ్యామిలీ నివాసం ఉండే విల్లాకు సమీపంలో జుహు ప్రాంతంలో సముద్రానికి దగ్గరగా అపార్ట్మెంట్ ను జూనియర్ బచ్చన్ కొనుగోలు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ అపార్ట్మెంట్ ను అభిషేక్ బచ్చన్ తో పాటు మరో ప్రముఖ స్టార్ కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇంతకీ ఈ ఖరీదైన భవనం విలువ ఎంత అనే విషయం బయటకు రాలేదు. దాదాపు 40 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన్నట్లు, రిజిస్ట్రేషన్ ఇతర ఖర్చులతో కలిపి సుమారు 50 కోట్లకు పైగా ఈ అపార్ట్మెంట్ కు ఖర్చు చేశాడని వార్తలు వస్తున్నాయి.
ఈ విషయంపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్న అభిషేక్ బచ్చన్ ఈ స్థాయిలో ఖర్చుపెట్టి ఆస్తులను ఎలా కొనుగోలు చేశాడని, ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ అపార్ట్మెంట్ ను దేశంలోనే పేరొందిన ఒబెరాయ్ రియాల్టీ సంస్థ ఇంక్లైన్ రియాల్టీ వద్ద కొనుగోలు చేసినట్లు సమాచారం. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి రియల్ ఎస్టేట్ రంగం అందరూ ఎంచుకుంటారు. అందులో భాగంగానే బాలీవుడ్ ప్రముఖులు కూడా ఇలా అపార్ట్మెంట్లను కొనడం, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడంపై ఆసక్తి చూపుతుంటారు.
ఆ మధ్య ఐశ్వర్యరాయ్ తో జూనియర్ బచ్చన్ విడాకులు అంటూ బాలీవుడ్ లో ప్రచారం జరిగింది కానీ, అది నిజం కాదని ప్రస్తుతం కొత్త అపార్ట్మెంట్ జూహులోనే ఐశ్వర్య, ఆద్యా ఉంటున్నట్లుగా సమాచారం. కాగా కొత్త ఫ్లాట్ గురించి ఇప్పటివరకు అభిషేక్ బచ్చన్ కానీ, ఒబెరాయ్ రియాల్టీ సంస్థ గాని స్పందించలేదు.