తిరుమల లడ్డూ వ్యవహారంపై తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ వివరణ

  • తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం వివాదం
  • తీవ్ర ఆరోపణలు చేసిన సీఎం చంద్రబాబు
  • టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న ఏఆర్ వెయిరీ
కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంలో పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపి కల్తీ నెయ్యి వాడారంటూ సీఎం చంద్రబాబు స్వయంగా ఆరోపించడం తెలిసిందే. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ఈ కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏఆర్ డెయిరీ స్పందించింది. 

నాణ్యతా పరీక్షల తర్వాతే టీటీడీకి నెయ్యి సరఫరా చేశామని స్పష్టం చేసింది. జూన్, జులై నెలలోనే నెయ్యి సరఫరా చేశామని, ల్యాబ్ పరీక్షలు సంతృప్తికరంగా అనిపించిన తర్వాతే నెయ్యిని సరఫరా చేసినట్టు ఏఆర్ డెయిరీ వివరించింది. తాము ఇప్పటివరకు సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి నాణ్యతా లోపం లేదని పేర్కొంది.


More Telugu News