దేవరలో ఆ సీన్ షూటింగ్ టైంలో చనిపోతానేమోనన్న భయం కలిగిందన్న తారక్
- తాజాగా తారక్ ఇంటర్వ్యూ విశేషాలు
- దేవర సినిమా షూటింగ్ పై ఎన్టీఆర్ వ్యాఖ్యలు
- షూటింగ్ లో తన ప్రాణం పోతుందేమోనని భయపడిన తారక్
దేవర మూవీ మరో వారం రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. దేవర ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్, కొరటాల శివ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ముంబయి, చెన్నై వంటి నగరాల్లో ప్రమోషన్స్ చేపడుతూ స్పీడు పెంచేశారు. తాజాగా కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ లను యువ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడిన మాటలు ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకున్నాయి.
"మీకు చాలా చిరాకేసిన సీన్ ఏదైనా ఉందా?" అన్న అని సిద్దు అడిగిన ప్రశ్నకి ఎన్టీఆర్ మాట్లాడుతూ... " గోవాలో సినిమా షూటింగ్ జరిగేటప్పుడు అక్కడ చాలా వేడిగా ఉంది. ఆ టైంలో ఎండ వేడి ఎక్కువగా ఉండడంతో నాకు చెమటలు పట్టేస్తున్నాయి. అక్కడ నిప్పుల వర్షం పైనుంచి కురుస్తుందా అన్నంత వేడిగా ఉంది. కాసేపు ఇక్కడే ఉంటే నేను చచ్చిపోతానేమో అన్నంత భయం వేసింది. ఆ టైంలో నాకు నా భార్య పిల్లలు గుర్తొచ్చారు. అంటే అక్కడ పరిస్థితి అంత దారుణంగా ఉంది.
ఆ టైంలో ఒక సీన్ నేను నవ్వుతూ చేయాల్సి ఉంది. ఆ సీన్ ఎప్పుడు అయిపోతుందా ఎప్పుడూ రిలాక్స్ అవుదామా అని నేను ఎదురు చూస్తూ ఉన్నా... ఆ సీన్ అయిపోగానే పక్కనే ఏసీ రూమ్ కనిపించింది. వెంటనే చాలా ఫాస్ట్ గా రూమ్ లోకి వెళ్లిపోయి, ఏసీ ఆన్ చేసుకుని పడుకున్నా అంతే.. ఒక్క నిమిషం కూడా కాలేదు వెంటనే పవర్ పోయింది. నా దరిద్రం ఏంటంటే అక్కడ జనరేటర్ కూడా లేదు. అప్పుడు చూడాలి... బయటికి వెళితే ఎండ, లోపల వేడి.. బయటికి వెళితే తందూరీ చికెన్ లాగా మాడిపోవడం, లోపల ఉంటే ఇడ్లీలా ఉడికిపోవడం, ఏం చేయాలో తెలియలేదు.
వెంటనే ఫోన్ తీసి జనరేటర్ ఆన్ చేయమని అడుగుదాం అంటే ఆ ముందు రోజే జనరేటర్ పాడైపోయిందని చెప్పారు. ఇక రూమ్ లో ఉండాలో, బయటకు వెళ్లాలో నాకు అర్థం కాలేదు. 40 నిమిషాల దాకా కరెంట్ రాలేదు... తర్వాత కరెంట్ వచ్చింది. కాస్త రిలాక్స్ అవుదాం అనుకునేసరికి షాట్ రెడీ అని పిలిచారు. ఇక అంతే నా మీద నాకే ఛీ అనిపించింది, చిరాకేసేసింది" అని ఎన్టీఆర్ చెప్పగానే... సిద్ధూ నవ్వుతూ "నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు అన్నా" అని అన్నారు. అవును ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు మీకు కూడా రాకూడదు అని ఎన్టీఆర్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
కథ చాలా కొత్తగా ఉంటుందని ,సినిమా చాలా బాగా వచ్చిందని ఎన్టీఆర్ ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. యాక్షన్ ఎపిసోడ్స్ కొత్తగా ఉంటాయని, జాన్వి చాలా టాలెంటెడ్ అని, అనిరుధ్ సంగీతం చాలా బాగుందని ఎన్టీఆర్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.