సింగరేణి కార్మికులకు రూ.796 కోట్ల బోనస్ ఇస్తున్నాం: భట్టివిక్రమార్క

  • సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్ ఇస్తున్నామన్న ఉపముఖ్యమంత్రి
  • సగటున ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షల బోనస్ ఇస్తున్నట్లు వెల్లడి
  • కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించామన్న భట్టి
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్‌ను ప్రకటించింది. కార్మికులకు రూ.796 కోట్ల బోనస్‌ను ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రకటన చేశారు. సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్‌ను ఇస్తున్నట్లు చెప్పారు.

సగటున ఒక్కో కార్మికుడికి ఒక లక్షా 90 వేల రూపాయల బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది కంటే ఈసారి ఒక్కో కార్మికుడికి రూ.20 వేలు అదనంగా ఇస్తున్నామన్నారు. 

సింగరేణిలో 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని వెల్లడించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇప్పటి వరకు లాభాలు పంచలేదని, ఇప్పుడు తాము పంచుతున్నామన్నారు. 2023-24లో సింగరేణి లాభం రూ.4,701 కోట్లుగా నమోదయిందన్నారు. వీరందరికీ సంతోషంగా బోనస్‌ను ప్రకటిస్తున్నామని ఉపముఖ్యమంత్రి అన్నారు.


More Telugu News