ఆ ముఖ్యమంత్రి వస్తున్నాడంటే నాకే ఆశ్చర్యం వేసేది: సీఎం చంద్రబాబు
ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, మాజీ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఏనాడైనా పది మందితో అతడు కలిసున్న ఫొటో ఎవరైనా చూశారా? జనాన్ని కలిసి సమస్యను విన్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు.
"ఆ ముఖ్యమంత్రి వస్తున్నాడంటే నాకు ఆశ్చర్యం వేసేది... రోడ్డు పక్కన పరదాలు కట్టేసేవారు. అతడు ఆకాశంలో వచ్చేవాడు... హెలికాప్టర్ లో వస్తుంటే కింద ఉన్న చెట్లన్నీ కొట్టేసేవారు. అంతేగాకుండా, ఒక కర్ఫ్యూ తరహా వాతావరణం కనిపించేంది. ఇష్టమున్నా, లేకపోయినా డ్వాక్రా సంఘాల వారిని బలవంతంగా తీసుకొచ్చేవారు. రాకపోతే పెన్షన్ కట్, రేషన్ కట్!
ఆయన సభకు వచ్చినవాళ్లు వెంటనే వెళ్లిపోకుండా చుట్టూరా కందకాలు తవ్వేసేవాళ్లు. ఇలాంటివన్నీ నేను టీవీలో చూసేవాడ్ని. అందుకే, ప్రజలందరూ కలిసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలన్న సంకల్పంతో, చరిత్రలో ఎన్నడూ చూడనంత విజయాన్ని సాధించి పెట్టారు" అని వివరించారు.