చంద్రబాబు 100 రోజుల పాలనపై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు
- జగన్ తప్పులను, అవినీతిని చూపించారన్న షర్మిల
- వైఎస్సార్ పేరును ఎక్కడ వీలుంటే అక్కడ తొలగించారని ఆవేదన
- సూపర్ సిక్స్ ను ఇంకా అమలు చేయలేదని విమర్శ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 100 రోజుల పాలన గురించి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 100 రోజుల పాలనలో శిశుపాలుడి లెక్కల మాదిరి మాజీ ముఖ్యమంత్రి జగన్ తప్పులను, అవినీతిని శ్వేతపత్రాల మాదిరి చూపించారని అన్నారు. ఇదే సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎక్కడ వీలుంటే అక్కడ తొలగించారని, వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
హామీల విషయంలో చంద్రబాబు ఏం చేశారని అడిగినా, కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో ఏం చేసింది అని అడిగినా... నూటికి 'సున్నా' అనే చెప్పాలని అన్నారు. సూపర్ సిక్స్ ను ఇంకా అమలు చేయలేదని విమర్శించారు. వంద రోజుల్లో రాష్ట్రాన్ని గాడిలో పెడతామని చెప్పారని... ఇంత వరకు ఆ దిశగా పెద్దగా సాధించిందేమీ లేదని అన్నారు.