మద్దిరాలపాడు ఆంజనేయస్వామి ఆలయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు

  • ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • మద్దిరాలపాడు గ్రామంలో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం
  • హాజరుకానున్న సీఎం 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటనకు విచ్చేశారు. మద్దిరాలపాడు గ్రామానికి వచ్చిన చంద్రబాబు ఇక్కడి ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబుకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. 

వాస్తవానికి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించాల్సి ఉండగా, ఆయన పర్యటన రద్దయింది. శ్రీకాకుళం జిల్లా పర్యటన స్థానంలో ప్రకాశం జిల్లా పర్యటన ఖరారైంది. 

చంద్రబాబు నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొంటారు. మద్దిరాలపాడు గ్రామంలో చంద్రబాబు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలవనున్నారు. అనంతరం గ్రామసభకు హాజరుకానున్నారు.


More Telugu News