ఇది సనాతన ధర్మంపై జరిగిన దాడి: రామజన్మ భూమి ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్
- తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన రామజన్మ భూమి ప్రధాన అర్చకుడు
- ఇది కచ్చితంగా కుట్రేనన్న ఆచార్య సత్యేంద్ర దాస్
- ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకోవాలని సూచన
- దోషులను కఠినంగా శిక్షించాలని వ్యాఖ్య
తిరుమల లడ్డూ ప్రసాదంపై నెలకొన్న వివాదంపై అయోధ్య రామజన్మ భూమి మందిరం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు. ఇది సనాతన ధర్మంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ అనేది తీవ్రమైన విషయమని ఆయన పేర్కొన్నారు.
ఆచార్య సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ... "పవిత్రమైన దైవ ప్రసాదంలో చేపనూనె కలిపినట్లు తనిఖీల్లో స్పష్టమైంది. ఇదంతా ఎప్పుడు జరిగిందో ఇప్పటికీ తెలియట్లేదు. ఇది కచ్చితంగా కుట్ర. సనాతన ధర్మంపై జరిగిన దాడి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ దాడిని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకోవాలి. సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి" అని ఆయన అన్నారు.