చెన్నై టెస్టు.. టీమిండియా 376 పరుగులకు ఆలౌట్
- చెన్నై వేదికగా బంగ్లాదేశ్, భారత్ తొలి టెస్టు
- అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అశ్విన్, జడేజా
- 199 పరుగుల భాగస్వామ్యం అందించిన ద్వయం
- ఐదు వికెట్లతో రాణించిన హసన్ మహమూద్
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 376 పరుగులకు ఆలౌట్ అయింది. 339/6 తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత జట్టు మరో 37 పరుగులు జోడించి మిగతా 4 వికెట్లు కోల్పోయింది.
భారత బ్యాటర్లలో రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ (113) తో రాణించగా.. రవీంద్ర జడేజా (86), ఓపెనర్ యశస్వి జైస్వాల్ (56) అర్ధ శతకాలు చేశారు. మిగతా బ్యాటర్లలో రిషభ్ పంత్ 36 పరుగులతో పర్వాలేదనిపించినా.. రోహిత్ శర్మ (06), విరాట్ కోహ్లీ (06), శుభ్‌మన్ గిల్ (0), కేఎల్ రాహుల్ (16) తీవ్రంగా నిరాశ పరిచారు.
ఇక 144 పరుగులకే కీలకమైన 6 వికెట్లు కోల్పోయి భారత జట్టు పీకలలోతు కష్టాల్లో ఉన్న సమయంలో అశ్విన్, జడేజా ద్వయం ఆదుకుంది. ఈ జోడి 199 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పింది. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 5 వికెట్లు తీయగా.. తస్కిట్ అహ్మద్ 3, నహీద్ రాణా, మెహదీ హసన్ చెరో వికెట్ పడగొట్టారు.