రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్ ను విచారిస్తున్న పోలీసులు

  • జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు 
  • గోవాలో అరెస్టు చేసి, తీసుకువచ్చిన పోలీసులు
  • విచారణ అనంతరం కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో పోక్సో కేసులో ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాను హైదరాబాద్ పోలీసులు నిన్న గోవాలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను ఈరోజు (శుక్రవారం) వేకువజామున గోవా నుండి హైదరాబాద్‌కు తీసుకుని వచ్చారు. నగరంలోని రహస్య ప్రదేశంలో పోలీసులు ఆయనను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించి ఉప్పర్ పల్లి కోర్టులో హజరుపరిచే అవకాశం ఉంది.  జానీ మాస్టర్‌పై కేసు నమోదు వ్యవహారం తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.


More Telugu News