ప్రసిద్ధి చెందిన ఈ 25 దేశాల్లో మద్యపానానికి చట్టబద్ధ వయసు ఎంతో తెలుసా!
- మన దేశంలో రాష్ట్రాల వారీ కనీస వయసు నిర్ణయం
- కనీసం 18 ఏళ్ల నుంచి మహారాష్ట్రలో గరిష్ఠంగా 25 ఏళ్లుగా నిర్ణయం
- ఫ్రాన్స్‌తో పాటు అనేక దేశాల్లో 18 ఏళ్లుగా ఉన్న చట్టబద్ద వయసు
- కొన్ని దేశాల్లో మాత్రమే 20 ఏళ్లు అంతకంటే ఎక్కువగా అమలు
కొంతమంది హాలిడే ట్రిప్ కోసమో, సేద దీరేందుకో విదేశాలకు వెళుతుంటారు. అక్కడ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి మద్యాన్ని ఇష్టంగా సేవిస్తుంటారు. అయితే మద్యం తాగేందుకు చట్టబద్ధ అర్హత వయసు అన్ని దేశాల్లోనూ ఒకే విధంగా ఉండదు. దేశాలు, వాటి చట్టాలను బట్టి మారుతూ ఉంటాయి. ప్రపంచంలోని 25 ప్రసిద్ధ దేశాల్లో మద్యపానానికి చట్టబద్ధ కనీస వయసు ఎంత ఉందో తెలుసుకుందా...
భారత్‌లో...
మనదేశంలో మద్యపాన చట్టాలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి. కనీసం వయసు 18 నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. ఉదాహరణగా గోవా, కేరళ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు కనీస వయసును 18 సంవత్సరాలుగా నిర్ణయించాయి. ఢిల్లీ, కర్ణాటకల్లో కనీస వయస్సు 21 ఏళ్లుగా ఉంది. అయితే మహారాష్ట్ర, చండీగఢ్ లో ఇది 25 సంవత్సరాలుగా ఉంది. కనీస వయోపరిమితి ఉన్నవారికి మాత్రమే వైన్ షాపుల్లో మద్యాన్ని విక్రయిస్తారు.
వైన్ సంస్కృతికి ప్రసిద్ధి చెందిన ఫ్రాన్స్‌లో కనీస వయసు ప్రస్తుతం 18 ఏళ్లుగా ఉంది. 2009కి ముందు 16 ఏళ్లుగా ఉండేది. దానిని స్వల్పంగా పెంచారు. ఇక ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాలు మద్యం సేవించడానికి కనీస వయసును 18 సంవత్సరాలుగా పాటిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆస్ట్రేలియాలో అతిగా సేవించేవారికి మద్యం విక్రయించరు.
ఇక యూఏఈ విషయానికి వస్తే ఎమిరేట్‌ని బట్టి వయసు ఆధారపడి ఉంటుంది. దుబాయ్‌లో కనీసం 21 ఏళ్లు, అబుదాబిలో కనీస వయస్సు 18 సంవత్సరాలుగా ఉంది. యూఏఈలో మద్యం విక్రయాలు చాలా పకడ్బందీగా జరుగుతాయి. బహిరంగంగా అస్సలు విక్రయించరు. లైసెన్స్ ఉన్న సంస్థలు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది.
సింగపూర్‌లో మద్యపానానికి కనీస వయస్సు 18 ఏళ్లు, అమెరికాలో 21 సంవత్సరాలు, కెనడాలోని చాలా ప్రావిన్సుల్లో 18 ఏళ్లుగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ పరిమితి 19 ఏళ్లుగా నిర్ణయించారు.
ఇక యూకేలో మద్యపానానికి చట్టబద్దమైన వయసు 18 ఏళ్లుగా ఉంది. అయితే రెస్టారెంట్‌లో కుటుంబ సభ్యులతో భోజనం చేసేటప్పుడు 16, 17 ఏళ్లవారు కూడా మద్యం సేవించవచ్చు. ఇక ఇటలీ, రష్యా, ఐర్లాండ్, మెక్సికో, స్పెయిన్, దక్షిణాఫ్రికా, థాయిలాండ్, న్యూజిలాండ్, మాల్దీవులు, సీషెల్స్, హాంకాంగ్, మారిషస్, చైనాలలో కనీస వయసు18 ఏళ్లుగా ఉంది. జర్మనీలో వైన్‌ని బట్టి 16 -18, జపాన్‌లో 20, స్విట్జర్లాండ్‌లో 16 -18 , శ్రీలంకలో 21 ఏళ్లుగా మద్యపానానికి కనీస చట్టబద్ద వయసులుగా ఉన్నాయి.