కృష్ణా పైప్‌లైన్ లీకేజీ కారణంగా హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాకు అంతరాయం
- కృష్ణా ఫేజ్-1లోని పైప్‌లైన్‌లో భారీ లీకేజీ
- దేవత్‌పల్లి వద్ద 300 ఎంఎం డయా ఎయిర్ వాల్వ్‌లో లీకేజీ
- సైదాబాద్, శివంరోడ్డు సహా పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
కృష్ణానది తాగునీటి సరఫరా ఫేజ్-1లోని పైప్‌లైన్‌లో భారీ లీకేజీ ఏర్పడింది. దీంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఈరోజు అంతరాయం కలుగుతుందని జలమండలి ప్రకటించింది. దేవత్‌పల్లి వద్ద 300 ఎంఎం డయా ఎయిర్ వాల్వ్‌లో ఆకస్మికంగా భారీగా లీకేజీ కనిపించిందని, ఈ కారణంగానే తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు.
లీకేజీ మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఈరోజు మధ్యాహ్నంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ లీకేజీ కారణంగా మిరాలం, కిషన్ బాగ్, సంతోష్ నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, యాకుత్‌పురా, బొగ్గులకుంట, నారాయణగూడ, అడిక్‌మెట్, శివం రోడ్డు, నల్లకుంట, చిలకలగూడ, దిల్‌సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు పాక్షిక అంతరాయం కలుగుతుందన్నారు.