స్క్విడ్ గేమ్ మళ్లీ వస్తోంది... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..!

  • నెట్ ఫ్లిక్స్ లో డిసెంబర్ 26 నుంచి సీజన్-2 ప్రసారం
  • ది గేమ్ విల్ నాట్ స్టాప్ అంటూ పోస్టర్ విడుదల చేసిన మేకర్స్
  • సోషల్ మీడియాలో టీజర్ విడుదల
స్క్విడ్ గేమ్ సీజన్-2 వచ్చేస్తోంది. ఓటీటీలో స్క్విడ్ గేమ్ సీజన్-1 ప్రపంచవ్యాప్తంగా ఎంతపెద్ద సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజన్-2 పై అంచనాలు పెరిగిపోయాయి. 

తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘ది గేమ్ విల్ నాట్ స్టాప్’ క్యాప్షన్ తో రూపొందించిన ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. దీంతో పాటు సీజన్-2 టీజర్ ను కూడా తాజాగా విడుదల చేశారు. రెండో సీజన్ లో లీ జంగ్ జే, పార్క్ హే సూ, హోయాన్ జంగ్ కీల‌క పాత్రల్లో న‌టించారని తెలిపారు.

మొదటి సీజన్ తరహాలోనే ఈ సీజన్ లోనూ స్క్విడ్ గేమ్ లో 456 మంది పాల్గొంటారని, ఒక్కో టాస్క్ పూర్తిచేస్తూ ముందుకు వెళతారని వివరించారు. సీజన్‌-2లో మొత్తం 9 ఎపిసోడ్స్‌ ఉన్నాయని, ఈసారి స్క్విడ్ గేమ్ రూల్స్ డిఫ‌రెంట్‌గా ఉంటాయని, ఫస్ట్ సీజన్ కు మించి ట్విస్టులతో సాగుతుందని అంటున్నారు. 

ఓ గేమ్ లో ఓడిపోయిన 392 జెర్సీ క్యాండిడేట్ ను గేమ్ నిర్వాహకులు చంపేయడం పోస్టర్ లో కనిపిస్తోంది. కాగా, స్క్విడ్ గేమ్ వెబ్‌సిరీస్‌ సీజన్-2ను డిసెంబ‌ర్ 26 నుంచి వ‌ర‌ల్డ్ వైడ్‌గా స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది.


More Telugu News