చిక్కకుండా తిరుగుతున్న రాకాసి తోడేలును పట్టుకునేందుకు అధికారుల ఎత్తుగడ
- ఉత్తరప్రదేశ్ లోని మహసి ప్రాంతంలో కొనసాగుతున్న ఆపరేషన్ భేడియా
- తోడేలుల మందలో ఐదింటిని బంధించిన అటవీ శాఖ అధికారులు
- ఆడ తోడేలు గొంతు అస్త్రంగా వినూత్న ప్రయోగం చేస్తున్న అధికారులు
ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లా మహసి ప్రాంతంలో సంచరిస్తున్న ఒక రాకాసి తోడేలును బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ముప్పుతిప్పలు పడుతున్నారు. ఆరు తోడేలుల మంద బారిన పడి పలువురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో తోడేలులను బంధించేందుకు అటవీశాఖ అధికారులు .. ఆపరేషన్ భేడియా చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో అధికారులు 90 శాతం విజయం సాధించారు. ఆపరేషన్ భేడియా కింద ఇప్పటి వరకూ ఐదింటిని అటవీ శాఖ అధికారులు బంధించారు. అయితే మరో తోడేలు మాత్రం ఎంత ప్రయత్నించినా బోనుకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతుండటంతో అధికారులు దాన్ని పట్టుకునేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు.
అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనుకు చిక్కకుండా తిరుగుతున్న దాన్ని మగ తోడేలుగా భావించిన అధికారులు.. దాన్ని పట్టుకునేందుకు ఆడ తోడేలు గొంతు అస్త్రంగా సరికొత్త ప్రయోగాన్ని చేస్తున్నారు. ఆడ తోడేలు ఊళ (గొంతు) రికార్డును వివిధ ప్రాంతాల్లో వినిపిస్తున్నారు. ఒకవేళ ఆ మగ తోడేలు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్లయితే .. ఆ ఊళ వినిపిస్తుందని, బంధించడం ఈజీ అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆడ తోడేలు గొంతుతో పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని డివిజన్ ఫారెస్టు అధికారి అజిత్ ప్రతాప్ సింగ్ మీడియాకు తెలిపారు.