జమ్మూకశ్మీర్ తొలి విడత పోలింగ్ వివరాలు

  • తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్న ఎన్నికల ముఖ్య కమిషనర్ పీకే పోలె
  • కిశ్త్‌వాడ్ నియోజకవర్గంలో అత్యధికంగా 77 శాతం పోలింగ్, పుల్వామాలో అత్యల్పంగా 46 శాతం పోలింగ్
  • అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు
జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, బుధవారం తొలి దశ పోలింగ్ జరిగింది. తొలి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 59 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల ముఖ్య కమిషనర్ పీకే పోలె తెలిపారు. కిశ్త్‌వాడ్ నియోజకవర్గంలో అత్యధికంగా 77 శాతం ఓటింగ్ నమోదు కాగా, పుల్వామాలో అత్యల్పంగా 46 శాతం పోలింగ్ నమోదైందని ఆయన తెలిపారు.

అన్ని చోట్ల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని, ఎక్కడా రీ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. తొలి దశలో పోలింగ్ జరిగిన 24 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 23 లక్షల మంది ఓటర్లు ఉండగా, 219 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. రెండో దశ పోలింగ్ సెప్టెంబర్ 15న, మూడో దశ పోలింగ్ అక్టోబర్ 1న నిర్వహించనుండగా, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు.


More Telugu News