ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని నియమించిన జగన్

  • పార్టీ బలోపేతంపై దృష్టిసారించిన జగన్
  • క్షేత్రస్థాయిలో మార్పులు చేర్పులు
  • తాజాగా నెల్లూరు జిల్లా నేతలకు పదవులు
వైసీపీ అధ్యక్షుడు జగన్ నెల్లూరు జిల్లాకు చెందిన నేతలను వివిధ హోదాల్లో నియమించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నియమించారు. కాకాణికి కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జిగానూ బాధ్యతలు అప్పగించారు. 

నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గం వైసీపీ పరిశీలకుడిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించారు. నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. 

నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి... నెల్లూరు కార్పొరేషన్ పార్టీ పరిశీలకుడిగా అనిల్ కుమార్ యాదవ్... రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ ను నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.


More Telugu News